గుహలలోన జొచ్చి గురువుల వెదకంగ
క్రూర మృగ మొకండు తారసిలిన
ముక్తి మార్గమదియె ముందుగా జూపురా
విశ్వదాభిరామ వినుర వేమ
భావం:
గురువులు కొరకై కొండగుహల్ని వెదకడానికి వెళ్తే అక్కడ ఒక్కోసారి క్రూరమృగాలు కనిపించి వెదకబోయినవారిని మింగ్రివేస్తాయి. అనగా గురువులమని చెప్పుతూ అమాయకులను మోసగించే వారు ఈ లోకంలో ఉన్నారు అని, వారినుంచివివేకంతో దూరంగా జరగమని వేమన చెప్తాడు.
అర్థాలు:
గుహలు=కొండగుహలు, చొచ్చి= ప్రవేశించి, క్రూరమృగం=పులి లాంటి జంతువు, తారసిల్లన్= ఎదురుపడితే, ముక్తిమార్గాన్ని=మోక్షమార్గాన్ని, చూపురా=చూపుతుంది.

No comments:
Post a Comment