Friday, November 7, 2014

టక్కురులను గూడి యెక్కసక్కెములాడ

టక్కురులను గూడి యెక్కసక్కెములాడ
నిక్కమైన ఘనుని నీతి చెడును
ఉల్లితోట బెరుగు మల్లె మొక్క కరణి
విశ్వదాభిరామ వినురవేమ

భావం: మంచివాడు చెడ్డవారితో కలిసి ఇతరుల్ని వికటంగా గేలిచేస్తే అతని గొప్పదనం కాస్త మంట కలుస్తుంది. ఉల్లితోటలో మల్లెమొగ్గ ఉంటే దాని వాసన నశిస్తుంది కదా. చెడ్డవారితో సాంగత్యం చేస్తే వారి దుర్గుణాలన్నీ మంచివారికీ వస్తాయ. అందుకనే దుష్టులకు దూరంగా ఉండుమని చెప్తారు.

అర్థాలు:
టక్కరులు = చెడ్డవారు,
కూడి = కలిసి,
ఎక్క సక్కెములు = వికారపు మాటలు,
నిక్కము + అయనఘనుని = నిజాయతి గల వారి యొక్క,
నీతి=నడవడి,
చెడును = పాడవుతుంది,
 పెరుగు = ఎదుగుతున్నై
మల్లెమొగ్గ కరణి = మల్లెమొగ్గ మాదిరి.

No comments:

Post a Comment