కంకరభట్టనంగ కాషాయములు గట్టి
కొలిచె ధర్మరాజు కోరి విరటు
కాలకర్మగతులు కనిపెట్టవలె నయా
విశ్వదాభిరామ వినురవేమ
భావం:
కాలంకర్మం కలిసిరాక వక్రిస్తే ధర్మరాజంతవాడు కావి గుడ్డలు కట్టి కంకుభట్టునే పేరుతో విరాటరాజు పంచచేరి వూడిగం చేయవలసివచ్చింది. కాలం కలసిరాకపోయనా, చేసేపని కలిసి అనుకొన్నట్టు రాకపోయనా విఫల ప్రయత్నం అని నిరాశ చెంది ప్రయత్నం వదలకుండా తిరిగి ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని భావం.
అర్థాలు:
కషాయములు+కట్టి=సన్న్యాసం దాల్చి, కంకుభట్టు+ అనన్+కన్=కంకుభట్టు అనే పేరుతో, విరటున్=విరాటరాజుని, కోరి =బుద్ధిపూర్వకంగా, కొలిచెన్=సేవించాడు, కాలకర్మగతులు=కాలగమనాన్ని కర్మరీతిని , కనిపెట్టవలెన్+ఆయా= గమనించాలి సుమా.

No comments:
Post a Comment