Friday, October 31, 2014

చెప్పు లోని రాయి చెవిలోని జోరీగ

పద్యము:

చెప్పు లోని రాయి చెవిలోని జోరీగ
కంటి లోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత గాదయా
విశ్వదాభిరామ వినుర వేమ.

---------------
వేమన శతకములోని పద్యమిది
---------------

భావం:

బాధలన్నీ ఒక్కమారే కల్గటం లోక సహజం, చెప్పులోని రాయి, చెవిలో జోరిగ, కంటిలో నలుసు, కాలిలో ముల్లు చిన్నవే అయినా వీటి బాధ ఎక్కువే ఇంట్లో పోరు వీటి అన్నింటి కంటే బాధాకరమైంది. ఈ పద్యంలో చూస్తే పైకి అన్ని తెలిసిన పదార్థాలే ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ పద్యాన్ని తరిచి చూస్తే అందులో నిగూడార్థం ఉంటుంది. 


No comments:

Post a Comment