Tuesday, March 10, 2015

చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు

చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు గొదువ గాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినుర వేమ

భావం:
ఆత్మశుద్దితో చేసే పుణ్యకార్యం కొంచెమైనా గొప్పదే. మర్రిచెట్టు విత్తనం ఎంతో చిన్నదైనా అంత పెద్ద చెట్టు దానిలోంచి పుడుతుంది. అంటే మనసుతో చేసే ఏ ఉపకారమైనా అంటే ఉపకారంచేసేటపుడు హృదయపూర్వకంగా చేస్తే అది మంచిఫలితాన్ని ఇస్తుంది.

అర్థాలు:
చిత్తశుద్ధి=ఆత్మ శుద్ధి, పుణ్యంబు=మంచి కార్యం, కొంచెము+ఐనన్= స్వల్పమైనప్పటికి, కొదువ+కాదు=తక్కువవేమి కాదు, మర్రి వృక్షంబు= మర్రి చెట్టు, విత్తనంబు=బీజం, ఎంత= ఏ పాటిది.

No comments:

Post a Comment